RBI: కరెన్సీ నోట్లపై గాంధీజీకి బదులుగా ఇత‌రుల ఫొటోల ముద్ర‌ణ‌పై ఆర్బీఐ మాట ఇదే

  • క‌రెన్సీ నోట్ల‌పై కొత్తగా ఠాగూర్‌, క‌లాం ఫొటోలు అంటూ ప్రచారం 
  • వాటిపై వివ‌ర‌ణ ఇచ్చిన ఆర్బీఐ
  • అలాంటి ప్ర‌తిపాదనేది లేద‌ని వెల్ల‌డి
rbi clarification on currency notes changes

క‌రెన్సీ నోట్ల‌పై మ‌హాత్మా గాంధీకి బ‌దులుగా ర‌వీంద్రనాథ్ ఠాగూర్‌, మాజీ రాష్ట్రప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం ఫొటోల‌తో కొత్త క‌రెన్సీ నోట్ల‌ను ముద్రించ‌నున్నట్లుగా వినిపిస్తున్న వార్త‌ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. దీనికి సంబంధించి త‌మ వ‌ద్ద ఎలాంటి కొత్త ప్ర‌తిపాద‌న లేద‌ని ఆర్బీఐ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ యోగేశ్ ద‌యాళ్ ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

క‌రెన్సీ నోట్ల‌లో మ‌రిన్ని మేర సెక్యూరిటీ ఫీచ‌ర్ల ఏర్పాటుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెస‌ర్‌, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ నిపుణుడు దిలీప్ స‌హానికి గాంధీ స‌హా ఠాగూర్‌,క‌లాం ఫొటోల‌ను ఆర్బీఐ పంపింద‌ని, కరెన్సీ నోట్ల‌పై గాంధీ ఫొటో స్థానంలో ఠాగూర్‌, క‌లాం ఫొటోల‌ ముద్ర‌ణ‌కు సంబంధించి ఆయ‌న నుంచి నివేదిక కోరింద‌ని కొన్ని మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలో వాటిపై వివ‌ర‌ణ ఇచ్చిన యోగేశ్ ద‌యాళ్ ఆ వార్త‌ల‌ను ఖండించారు.

More Telugu News