Nayanthara: తమ పెళ్లి వేడుకకు సీఎం స్టాలిన్ ను ఆహ్వానించిన విఘ్నేశ్, నయనతార

Nayanthara and Vignesh Shivn to marry on June 9 meet Tamil Nadu CM MK Stalin to extend invite
  • ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసిన ప్రేమ జంట
  • పెళ్లికి రావాలంటూ ఆహ్వానం
  • వీరి వెంట స్టాలిన్ కుమారుడు ఉదయనిధి

చిరకాల ప్రేమికులు విఘ్నేశ్ శివన్, నయనతార వివాహ ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 9వ తేదీన చెన్నైలో వీరి పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ జంట సీఎం స్టాలిన్ ను కలసి పుష్పగుచ్ఛాన్ని అందించి.. తమ పెళ్లికి రావాలని ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు. వీరి వెంట నటుడు, నిర్మాత, సీఎం స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరింది. 

చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి జరగనున్నట్టు సమాచారం. తమ పెళ్లి గురించి నయనతార గతేడాదే బయటపెట్టడం తెలిసిందే. ఆమె చేతికి ఉంగరం ఉండడంతో ఓ టీవీ యాంకర్ ప్రశ్నించగా.. విఘ్నేశ్ శివన్ తో ఎంగేజ్ మెంట్ అయినట్టు ఆమె వెల్లడించింది. 'నానుమ్ రౌడీదాన్' సినిమా నుంచి విఘ్నేశ్, నయన్ మధ్య ప్రేమ నడుస్తోంది. ఈ జంట ఇటీవలే 'కాతు వాకుల రెండు కాదల్' సినిమాను చేసిన విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News