Shah Rukh Khan: కరోనా బారిన పడిన బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్

Bollywood star Shah Rukh Khan tested corona positive
  • షారుఖ్ కు కరోనా పాజిటివ్
  • ఐసోలేషన్ లో స్టార్ హీరో
  • ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అక్షయ్ కుమార్
  • క్వారంటైన్ పూర్తి చేసుకున్న కత్రీనా కైఫ్
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పరీక్షలో పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో షారుఖ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్ లో కరోనా వ్యాప్తి అధికమైంది. కత్రీనా కైఫ్, ఆర్యన్ కార్తీక్, ఆదిత్య రాయ్ కపూర్ సైతం కరోనా పాజిటివ్ జాబితాలో చేరారు. 

ఇటీవలే అక్షయ్ కుమార్ సైతం కరోనా బారినపడ్డారు. కొన్నిరోజుల కిందే కోలుకున్నారు. కత్రీనా సైతం క్వారంటైన్ పూర్తి చేసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. నగరంలోని సినీ స్టూడియోలు పార్టీలు, వేడుకలు ఏర్పాటు చేయరాదని సూచించింది
Shah Rukh Khan
Corona Virus
Positive
Bollywood

More Telugu News