నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను పార్టీ నుంచి తొలగించిన బీజేపీ హైకమాండ్
- మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు
- తీవ్రంగా పరిగణించిన బీజేపీ హైకమాండ్
- ఇద్దరి ప్రాథమిక సభ్యత్వాలు రద్దు
- మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు సహించబోమని వెల్లడి
బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని వెల్లడించింది. పౌరులు ఏ మతాన్ని అయినా స్వేచ్ఛగా ఎంచుకునే హక్కు రాజ్యాంగం ద్వారా లభించిందని, దీన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది.
ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో కాన్పూర్ లో ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. కాన్పూర్ లో హింస కూడా చోటుచేసుకుంది. కాన్పూర్ లో ఆగ్రహావేశాలు రగులుకుంటున్న సమయంలో ట్విట్టర్ లో మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి నవీన్ జిందాల్ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు.