Devineni Uma: కేసీఆర్ నుంచి ఎన్నికల నిధులు తెచ్చుకోవడం వల్లే జగన్ మాట్లాడలేదు: దేవినేని ఉమ

Devineni Uma slams CM Jagan over Polavaram issue
  • పోలవరం అంశంలో దేవినేని ఉమ స్పందన
  • నిర్వాసితుల డబ్బు కాజేశారని ఆరోపణ
  • జగన్ జైలుకెళ్లడం ఖాయమని వెల్లడి

పోలవరం అంశంలో మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెంచారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను సీఎం జగన్ ఎందుకు ఖండించలేదని ఉమ ప్రశ్నించారు. కేసీఆర్ నుంచి గత ఎన్నికల కోసం నిధులు తెచ్చుకున్నందువల్లే జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. 

కాగా, పోలవరం నిర్వాసితులకు అందాల్సిన డబ్బు అందలేదని, ఆ డబ్బును ప్రభుత్వ పెద్దలు మింగేశారని ఆరోపించారు. ఈ అంశంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఉమ స్పష్టం చేశారు. ఈ స్కాంలో పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అనంతబాబు పాత్ర ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News