Vishnu Vardhan Reddy: ఎవరినో ముఖ్యమంత్రిని చెయ్యడానికి బీజేపీ, జనసేన సిద్ధంగా లేవు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnuvardhan Reddy says only BJP and Janasena alliance will establish govt in AP
  • పొత్తులపై నిన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
  • మరింత స్పష్టతనిచ్చిన బీజేపీ నేత విష్ణు
  • ఎవరికోసమో తాము త్యాగాలు చేయబోమని వెల్లడి
  • బీజేపీ-జనసేన కూటమే అధికారం ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటన
రేపు (జూన్ 6) ఏపీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరికొందరు బీజేపీ జాతీయ నేతలు వస్తున్నారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నడ్డా పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నిన్న పవన్ కల్యాణ్ చెప్పినట్టు బీజేపీ-జనసేన కూటమి ఎవరికోసమో త్యాగాలు చేసేందుకు సిద్ధంగా లేదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడాలన్న తమ ఉద్దేశాన్ని చాటిచెప్పారు. 

గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాల తప్పుల కారణంగా రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కివెళ్లిందని విమర్శించారు. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరినో ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీ, జనసేన సిద్ధంగా లేవని స్పష్టం చేశారు. తమ వైఖరి ఇదేనని అన్నారు.
Vishnu Vardhan Reddy
BJP
Janasena
Alliance
TDP
Andhra Pradesh

More Telugu News