Janasena: జ‌న‌సేన విస్తృత స్థాయి స‌మావేశం ప్రారంభం... ఏపీలో శాంతిభ‌ద్ర‌త‌ల‌పైనే కీల‌క చ‌ర్చ‌

janasena metting starts at party mangalagiri office
  • తాడేప‌ల్లి కార్యాల‌యంలో స‌మావేశం
  • ప‌వ‌న్‌తో పాటు నాదెండ్ల, నాగ‌బాబుల హాజ‌రు
  • అమ‌లాపురం అల్ల‌ర్ల‌పై కీల‌క చ‌ర్చ‌
  • కౌలు రైతు భ‌రోసా, పార్టీ బ‌లోపేతంపైనా దృష్టి
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలో మంగ‌ళ‌గిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం శ‌నివారం మ‌ధ్యాహ్నం మొద‌లైంది. ఈ స‌మావేశానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌, పీఏసీ స‌భ్యుడు నాగబాబు, ఇత‌ర ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు. 

ఈ స‌మావేశంలో ఏపీలో శాంతి భ‌ద్ర‌త‌లే కేంద్రంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న హ‌త్య‌లు, అత్యాచారాలు, అమ‌లాపురం అల్ల‌ర్లు త‌దిత‌రాల‌పై స‌మావేశంలో కీల‌క చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. దీనితో పాటు పార్టీ బ‌లోపేతం, రాష్ట్రంలో కౌలు రైతుల‌కు అండ‌గా నిలుస్తూ పార్టీ చేప‌ట్టిన కౌలు రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.
Janasena
Pawan Kalyan
Nadendla Manohar
Nagababu

More Telugu News