మాచర్లలో వరుస హత్యలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

04-06-2022 Sat 14:27
  • ఆ ఒక్క నియోజకవర్గంలోనే ఐదుగురు బీసీల హత్య
  • వాటి వెనుక పిన్నెల్లి హస్తం ఉందని టీడీపీ అధినేత ఆరోపణ
  • ప్రత్యేక కోర్టులు పెట్టి నేరస్థులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్
Pinnelli Is Behind The Murders Alleges Chandrababu
టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్యపై పార్టీ అధినేత తీవ్రస్థాయిలో స్పందించారు. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని, ఆ హత్యల వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిపించి హత్యలు చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. 

జల్లయ్య అంత్యక్రియలు, ఆయన కుటుంబ సభ్యుల పరామర్శ కోసం వెళుతున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం పట్ల చంద్రబాబు మండిపడ్డారు. ప్రాణాలను కాపాడలేని పోలీసులు.. తమ నేతలను అడ్డుకోవడమేంటని ఆయన నిలదీశారు. జల్లయ్య మృతదేహాన్ని ఎక్కడకు తీసుకెళ్లారో కూడా చెప్పలేదని మండిపడ్డారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.