Nisar Khanday: జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్... హిజ్బుల్ కమాండర్ ను హతమార్చిన భద్రతా బలగాలు

Security forces killed HM Commander in Anantnag districts
  • అనంత్ నాగ్ జిల్లా రిషిపొరాలో ఎదురుకాల్పులు
  • హిజ్బుల్ కమాండర్ నిసార్ ఖండే మృతి
  • ముగ్గురు జవాన్లకు గాయాలు
  • ఎన్ కౌంటర్ కొనసాగుతోందన్న ఐజీ 
జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ కమాండర్ ను కాల్చి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికులతో పాటు ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని తెలిపారు. క్షతగాత్రులను వాయు మార్గంలో శ్రీనగర్ లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. 

కాగా, మరణించిన హిజ్బుల్ కమాండర్ ను నిసార్ ఖండేగా గుర్తించారు. ఈ సందర్భంగా ఓ ఏకే-47 రైఫిల్ ను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెల్లడించారు.
Nisar Khanday
Commander
Hijbul Muzahiddin
Encounter
Police
Anantnag District
Jammu And Kashmir

More Telugu News