'మనసంతా నువ్వే' సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని నిశ్చితార్థం!
- సుహాని ప్రస్తుత వయసు 31 సంవత్సరాలు
- మోడలింగ్ రంగంలో కూడా రాణించిన సుహాని
- విభర్ హసీజాతో సుహాని నిశ్చితార్థం
మ్యుజీషియన్, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'బాల రామాయణం' చిత్రంతో సుహాని సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమెకు తగినంత గుర్తింపు రాలేదు. ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు కావాల్సినంత సక్సెస్ రాలేదు. చివరి సారిగా 2010లో 'స్నేహగీతం' చిత్రంలో ఆమె నటించింది.
.