స్విగ్గీ వన్ సభ్యులకు ఏ రెస్టారెంట్ నుంచి అయినా ఉచిత డెలివరీ!

03-06-2022 Fri 13:17 | National
  • 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత డెలివరీ సేవ
  • కనీస ఆర్డర్ విలువ రూ.199 నుంచి రూ.149కి తగ్గింపు
  • రూ.149లోపు ఉంటే డెలివరీ చార్జీ
  • స్విగ్గీ వన్ సభ్యులకు పలు ఇతర ప్రయోజనాలు
Swiggy One users will get free delivery from all restaurants two more benefits
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. తన స్విగ్గీ వన్ సభ్యుల కోసం ప్రయోజనాల్లో మార్పులు చేసింది. ఇకమీదట యూజర్ ఆర్డర్ చేసిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఏ రెస్టారెంట్ నుంచి అయినా డెలివరీ ఉచితమే. ఇప్పటి వరకు ఎంపిక చేసిన కొన్ని రెస్టారెంట్ల నుంచి మాత్రమే డెలివరీ ఉచితంగా లభించేది.

ఇక ఏ రెస్టారెంట్ నుంచి అయినా ఉచిత డెలివరీ సదుపాయం పొందాలంటే ఆర్డర్ విలువ కనీసం రూ.149 ఉండాలి. లేదంటే అప్పుడు సాధారణ యూజర్ల మాదిరే డెలివరీ చార్జీ పడుతుంది. ఇప్పటివరకు ఉచిత డెలివరీ కనీస ఆర్డర్ విలువ రూ.199పైనే లభించింది.  

స్విగ్గీ వన్ సభ్యులు హైపర్ లోకల్ ఇన్ స్టా మార్ట్ సర్వీస్ ద్వారా 10 నిమిషాల్లోనే గ్రోసరీ డెలివరీ సదుపాయాన్ని పొందొచ్చు. ఇన్ స్టా మార్ట్ పై 1,000 పాప్యులర్ ఉత్పత్తులపై స్విగ్గీ వన్ సభ్యులకు ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఇక స్విగ్గీ జెనీ (కొరియర్ సేవలు) కింద పికప్, డ్రాప్ ఆఫ్ సేవలకు రూ.35 చార్జీపై స్విగ్గీ వన్ సభ్యులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.