10 నిమిషాల్లోనే ముగిసిన నిర్మలా సీతారామన్, జగన్ భేటీ
- మోదీతో భేటీ తర్వాత నిర్మల నివాసానికి జగన్
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిర్మలకు జగన్ వివరణ
- కేంద్రం నుంచి మరింత మద్దతు కావాలని అభ్యర్థన
ఈ సందర్భంగా నిర్మలతో పలు అంశాలపై జగన్ చర్చలు జరిపారు. సాయంత్రం 5.30 గంటలకు మొదలైన వీరిద్దరి భేటీ కేవలం 10 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, పన్నుల రాబడి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహకారం, ఇంకా అందాల్సిన మద్దతు తదితరాలను కేంద్ర మంత్రికి జగన్ వివరించినట్లు సమాచారం.