Telangana: క‌న్న‌డ ప‌త్రిక‌ల్లో తెలంగాణ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న‌లు.. బీఎస్పీ క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ విమర్శలు

bsp convenor r s praveen kumar fires on kcr government over telangana ads in kannada papers
  • నేడు తెలంగాణ ఆవిర్భావ దినం
  • ప‌త్రిక‌ల‌కు పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన ప్రభుత్వం
  • క‌న్న‌డ ప‌త్రిక ఫ్రంట్ పేజీలోనే తెలంగాణ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న‌
  • ఏం వెల‌గ‌బెట్టిండ్రంటూ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఫైర్‌
తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం గురువారం రాష్ట్రవ్యాప్తంగా వేడుక‌ల‌ను నిర్వ‌హించింది. అంతేకాకుండా రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌భుత్వం సాధించిన ప్ర‌గ‌తిని వివ‌రిస్తూ కేసీఆర్ స‌ర్కారు భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌ల‌ను విడుద‌ల చేసింది. ప్ర‌త్యేకించి ప‌త్రిక‌ల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ ప్ర‌క‌ట‌న‌లు భారీగా క‌నిపించాయి. తెలుగు ప‌త్రిక‌ల‌తో పాటు క‌న్న‌డ ప‌త్రిక‌ల‌కు కూడా స‌ర్కారు ఫ్రంట్ పేజీ ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసింది. 
ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ... కేసీఆర్ స‌ర్కారు తీరుపై బీఎస్పీ రాష్ట్ర క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏం వెల‌గ‌బెట్టార‌ని తెలంగాణ డ‌బ్బుల‌తో క‌ర్ణాట‌క‌లో కోట్ల రూపాయ‌ల విలువ చేసే ఫ్రంట్ పేజీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చార‌ని ఆయ‌న నిల‌దీశారు. రాష్ట్రంలో పింఛ‌న్లు లేక అవ్వాతాత‌లు ఎడుస్తుంటే.. కేసీఆర్ స‌ర్కారు రాష్ట్రంతో సంబంధం లేని ప‌త్రిక‌ల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
Telangana
Telangana Formation Day
KCR
TRS
BSP
R S Praveen Kumar

More Telugu News