Vishnu Vardhan Reddy: భారీ ఖర్చు పెట్టి దావోస్ వెళ్లిన జగన్ సాధించింది ఏమీ లేదు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Jagan achieved nothing with Davos trip says Vishnu Vardhan Reddy
  • జగన్ పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదన్న విష్ణు 
  • దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వానిదే నిర్ణయమని మంత్రి చెప్పడం దారుణమని వ్యాఖ్య 
  • గ్రూప్ 1 అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న బీజేపీ నేత 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. భారీగా ఖర్చు పెట్టి, దావోస్ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వానిదే నిర్ణయమని ఒక మంత్రి అనడం దారుణమని అన్నారు. మసీదుల్లో మౌజన్లకు, పాస్టర్ లకు డబ్బులు ఇస్తూ దేవాలయంలో మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే చర్చిలు, మసీదుల మాదిరిగా దేవాలయాలను కూడా స్వేచ్ఛగా ఉంచుతాం. ఇక గ్రూప్ 1 పరీక్షల అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని... దీనిపై గవర్నర్ కు లేఖ రాస్తామని చెప్పారు. అవినీతిపై ఫిర్యాదులకు యాప్ ప్రవేశ పెడుతుండటంపై ఆయన మాట్లాడుతూ... వైసీపీ నేతల అవినీతితోనే దాన్ని మొదలు పెట్టాలని అన్నారు.
Vishnu Vardhan Reddy
BJP
Jagan
YSRCP

More Telugu News