Nikhat Zareen: ప్ర‌ధాని మోదీతో బాక్సింగ్ చాంపియ‌న్ నిఖ‌త్ జ‌రీన్ సెల్ఫీ

Prime Minister Narendra Modi meets the women boxers Nikhat Zareen and Manisha Moun and Parveen Hooda
  • వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించిన నిఖ‌త్‌
  • ఢిల్లీలో ప్ర‌ధాని మోదీని క‌లిసిన తెలంగాణ బాక్సర్‌
  • మ‌నీషా మౌన్‌ చేతిపై ష‌ర్ట్ మీద మోదీ ఆటోగ్రాప్‌
ఇటీవ‌లే జ‌రిగిన వ‌రల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్ షిప్‌లో స‌త్తా చాటి వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించిన తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ బుధ‌వారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని క‌లిసింది. నిఖ‌త్‌తో పాటు వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్ షిప్‌లో ప‌త‌కాలు సాధించిన మ‌నీషా మౌన్‌, ప‌ర్వీన్ హూడా కూడా మోదీని క‌లిశారు. 
ఈ సంద‌ర్భంగా మోదీతో క‌లిసి నిఖ‌త్ ఓ సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీలో త‌న‌కు, మోదీ మ‌ధ్య తాను సాధించిన ప‌త‌కాన్ని పెట్టి మ‌రీ ఆమె సెల్ఫీ తీసుకుంది. ఈ సంద‌ర్భంగా మ‌నీషా మౌన్‌ త‌న చేతిపై ష‌ర్ట్ మీద‌నే మోదీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ ముగ్గురు బాక్స‌ర్ల‌తో మోదీ ఉల్లాసంగా గ‌డిపారు.
Nikhat Zareen
Manisha Moun
Parveen Hooda
Prime Minister
Narendra Modi
World Boxing Champion

More Telugu News