Sania Mirza: ఫ్రెంచ్ ఓపెన్ లో సానియా మీర్జాకు నిరాశ!

Sania Mirza and Lucie Hradecka knocked out of French Open
  • మహిళల డబుల్స్ మూడో రౌండ్ లో ఓటమి
  • చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి లూసీ హడెక్కాతో కలిసి బరిలోకి దిగిన సానియా 
  • కోకో గాఫ్, జెస్సికా పెగులా చేతిలో పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ లో భారత స్టార్ సానియ మీర్జాకు నిరాశ ఎదురైంది. మూడో రౌండ్ లో సానియా మీర్జా, చెక్ రిపబ్లిక్ కు చెందిన లూసీ హడెక్కా జంట పరాజయం పాలయింది. అమెరికాకు చెందిన కోకో గాఫ్, జెస్సికా పెగులా చేతిలో 6-4, 6-3 తేడాతో ఓడిపోయింది. సానియా, లూసీ జంట అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చినప్పటికీ ప్రత్యర్థుల ముందు తలవంచక తప్పలేదు. అనవసర తప్పిదాలతో సానియా జోడీ మ్యాచ్ ను చేజార్చుకుంది.
Sania Mirza
Tennis
French Open

More Telugu News