అప్పటికే గర్భవతి... మరోసారి గర్భం దాల్చి కవలలకు జన్మనిచ్చింది!

  • రెండు గర్భాలు మోసిన మహిళ
  • తొలి గర్భం దాల్చిన కొన్నిరోజులకే మరో గర్భం
  • టెక్సాస్ లో ఘటన
Texas woman carries two pregnancies

అమెరికాకు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ విస్మయకర రీతిలో కవలలకు జన్మనిచ్చింది. కవలలకు జన్మనివ్వడం సాధారణమైన విషయమే అయినా, ఆమె రోజుల తేడాతో రెండు గర్భాలు ధరించిన వైనం అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఆమె పేరు కారా విన్ హోల్డ్. టెక్సాస్ కు చెందిన విన్ హోల్డ్ కొన్నాళ్ల కిందట గర్భం దాల్చింది. కొన్నిరోజుల వ్యవధిలోనే మరోసారి గర్భం దాల్చింది. ఓ గర్భం కొనసాగుతుండగానే, మరో గర్భం ఏర్పడింది. దీన్ని వైద్య పరిభాషలో సూపర్ ఫీటేషన్ అంటారు. తొలి గర్భం ఏర్పడిన కొన్నిరోజుల వ్యవధిలో గానీ, కొన్ని వారాల వ్యవధిలోగానీ రెండో గర్భం ఏర్పడుతుంది. 

తనలో రెండుసార్లు అండాలు విడుదలవగా, అవి విభిన్న సమయాల్లో ఫలదీకరణం చెందడంతో రెండు గర్భాలు ఏర్పడినట్టు డాక్టర్ వివరించారని విన్ హోల్డ్ వెల్లడించింది. కాగా, గతంలో ఈ మహిళకు మూడు పర్యాయాలు గర్భస్రావం జరిగింది. నాలుగో పర్యాయం నిజంగా అద్భుతం జరిగిందని విన్ హోల్డ్ తన కవలలను చూసుకుని మురిసిపోతోంది.

More Telugu News