YSRCP: దావోస్ టూర్ ముగించుకుని ఏపీకి చేరిన సీఎం జ‌గ‌న్‌

ap cm ys jagan get warm welcome at gannavaram airport
  • ఈ నెల 22 నుంచి 26 వ‌ర‌కు దావోస్ స‌ద‌స్సు
  • స‌ద‌స్సులో ఏపీ బృందానికి నేతృత్వం వ‌హించిన జ‌గ‌న్
  • మంగ‌ళ‌వారం గ‌న్న‌వ‌రం చేరుకున్న జ‌గ‌న్‌
  • స్వాగ‌తం ప‌లికిన మంత్రి జోగి, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దావోస్ ప‌ర్య‌ట‌న ముగించుకుని మంగ‌ళ‌వారం రాష్ట్రానికి చేరుకున్నారు. నేటి ఉద‌యం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకున్న సీఎం జ‌గ‌న్‌కు స్థానిక ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ స్వాగ‌తం ప‌లికారు. అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మంత్రి జోగి ర‌మేశ్, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌, డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి త‌దిత‌రులు కూడా జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికారు.

ఈ నెల 22 నుంచి 26 వ‌ర‌కు దావోస్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ ఎకన‌మిక్ ఫోరం స‌ద‌స్సులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ద‌స్సుకు హాజ‌రైన ఏపీ ప్ర‌తినిధి బృందానికి స్వ‌యంగా సీఎం జ‌గ‌నే నేతృత్వం వ‌హించారు. ఈ నెల 26న దావోస్ స‌ద‌స్సు ముగియ‌గా... మంగ‌ళ‌వారం జ‌గ‌న్ విజ‌య‌వాడ చేరుకున్నారు.
YSRCP
YS Jagan
Andhra Pradesh
Davos
Gannavaram Airport

More Telugu News