Lung Cancer: ముఖ భాగంలో లంగ్ కేన్సర్ లక్షణాలు ఇలా ఉంటాయి..!

  • చెవి వెనుక భాగంలో నొప్పి
  • కొన్ని సందర్భాల్లో దవడ భాగానికీ విస్తరణ
  • ముఖంపై వాపులు, నొప్పి
  • ఊపిరితిత్తుల చుట్టూ నీరు
  • వెన్ను నొప్పి కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే
Lung Cancer Symptoms Many Patients Experience Pain In These Parts Of The Face

నిశ్శబ్దంగా ప్రాణాలను కబళించే కేన్సర్ మహమ్మారి ఎన్నో ఏళ్లుగా ఒక సంక్షోభంగా మన మధ్యే కొనసాగుతోంది. ఏటేటా కేన్సర్ కేసులు పెరుగుతుండడం ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురి చేసే అంశం. కేన్సర్లలో నూ లంగ్ కేన్సర్ కు సంబంధించి లక్షణాలు పెద్దగా తెలియవు. ముందుగా గుర్తిస్తేనే ఈ మహమ్మారి ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు. 

కేన్సర్ తొలి నాళ్లలో గుర్తించడం కష్టం. కేన్సర్ కణాలు మరింత పెరిగిపోయి, విస్తరించిన తర్వాతే ప్రభావాలు బయటకు కనిపిస్తుంటాయి. అప్పటికే అది మూడు, లేదంటే నాలుగో దశకు చేరిపోయి ఉంటుంది. దాంతో ప్రాణాంతకంగా మారొచ్చు. అయితే, లంగ్ కేన్సర్ లో కొన్ని లక్షణాలు ముఖ భాగంలో కనిపించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అదే పనిగా నొప్పితో బాధపడడం కేన్సర్ లక్షణాల్లో ఒకటి. చెవి వెనుక భాగంలో టెంపోరియల్ రీజియన్ లో నొప్పి వస్తుంటుంది. అక్కడి నుంచి దవడ భాగానికీ విస్తరిస్తుంది. తలనొప్పి కూడా రావచ్చు. పడుకుంటే, రెండు చేతులు పైకి ఎత్తినప్పుడు తలనొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. ఇవి లంగ్ కేన్సర్ లక్షణాలు కూడా అయి ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. 2018లో కళ్ల చుట్టూ, ముఖంపైన వాపుతో ఒక రోగి డెర్మటాలజిస్ట్ ను సంప్రదించగా.. అతడికి స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ ఉన్నట్టు బయటపడింది. 

ఎందుకని ఇలా..?
కేన్సర్ పై యాంటీబాడీలు ఫైట్ చేస్తుంటాయి. అదే సమయంలో సాధారణ నాడీ సంబంధ కణాలపైనా పొరపాటుగా దాడికి దిగుతాయి. ముఖానికి దారితీసే వెస్సెల్ పైనా కేన్సర్ కారణంగా ఏర్పడిన కణతి నుంచి ఒత్తిడి వ్యాపిస్తుంది. దీనివల్ల నొప్పితోపాటు వాపు కూడా కనిపించొచ్చు. తల, మెడ కేన్సర్ ఉన్న వారిలో 80 శాతం మందికి ముఖంపై నొప్పులు, వాపు కనిపిస్తాయి. 

ఇక లంగ్ కేన్సర్ లో ఈ లక్షణాలతో పాటు.. ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం, ఇన్ఫెక్షన్లు, రక్తంలో క్లాట్, క్యాల్షియం స్థాయులు పెరిగిపోవడం, వెన్ను నొప్పి తదితర లక్షణాలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News