సినిమా ప్రమోషన్ కోసం విశాఖ చేరుకున్న రణబీర్ కపూర్.. భారీ పూలమాలతో స్వాగతం
- బ్రహ్మాస్త్ర సినిమా ప్రచారం కోసం వచ్చిన కపూర్
- క్రేన్ సాయంతో భారీ పూలమాలను సమర్పించిన అభిమానులు
- ఘన స్వాగతంతో ముగ్ధుడైన రణబీర్ కపూర్
ఘనమైన ఆహ్వానాన్ని చూసిన రణబీర్ కపూర్ సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కొంత మంది అభిమానులకు షేక్ హ్యండ్ ఇచ్చారు. అలియా భట్ ఎక్కడ? అంటూ కొందరు అభిమానులు ప్రశ్నించారు. రణబీర్ కపూర్, అలియా భట్ ఈ సినిమాలో జంటగా నటించారు. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్ 14న ఈ జంట వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే కానుంది. దీనికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్ వంటి ఎందరో ఈ సినిమాలో కనిపించనున్నారు. విశాఖ పర్యటనలో కపూర్ వెంట అయాన్ ముఖర్జీ కూడా ఉన్నారు. (వీడియో కోసం)