'విక్రమ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నితిన్ సినిమా సాంగ్ రిలీజ్!

  • కమల్ హీరోగా రూపొందిన 'విక్రమ్'
  • ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న నితిన్ 
  • ఈ రోజున తెలుగు వెర్షన్ 'విక్రమ్' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా రానున్న వెంకటేశ్ 
Macharla Niyojakavargam movie update

కమల హాసన్ కథానాయకుడిగా 'విక్రమ్' సినిమా రూపొందింది. కమల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. జూన్ 3వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  తెలుగులో ఈ సినిమాను హీరో నితిన్ తన సొంత బ్యానర్లో రిలీజ్ చేస్తున్నాడు. 

తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ - శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వెంకటేశ్ రానున్నారు. కమల్ .. వెంకీల మధ్య 'ఈనాడు' సినిమా నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. 

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కమల్ చేతుల మీదుగా నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' సినిమాకి సంబంధించిన ఫస్టు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కృతి శెట్టి  -  కేథరిన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News