ఎయిర్ టెల్ కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు ఇవే..!

  • రూ.699, రూ.1,099, రూ.1,599.. మూడు కొత్త ప్లాన్లు
  • రూ.699 ప్లాన్ లో డేటా వేగం తక్కువ
  • మిగిలిన రెండు ప్లాన్లలో డేటా వేగపరమైన వ్యత్యాసమే
  • 14 ఓటీటీ ప్లాట్ ఫామ్ ల సేవలు ఉచితం
Airtel announces new Xstream Fiber broadband plans

ఎయిర్ టెల్ నూతనంగా ఎక్స్ ట్రీమ్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.699, రూ.1,099, రూ.1,599 ప్లాన్లు ఇందులో ఉన్నాయి.

రూ.1,599 ప్లాన్ లో ఎయిర్ టెల్ 4కే ఎక్స్ ట్రీమ్ సెట్ టాప్ బాక్స్ తో పాటు 350 చానల్స్ అందుకోవచ్చు. ఈ బాక్స్ కోసం ఒక్క విడత రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. యూజర్లు ఈ సెట్ టాప్ బాక్స్ తో కేబుల్ టీవీ చానళ్లే కాకుండా ఓటీటీ కంటెంట్ ను కూడా వీక్షించొచ్చు. 300 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, సోనీలివ్ ఇలా 14 ఓటీటీ సేవలను ఉచితంగా పొందొచ్చు. ఈ ప్లాన్ లో ఒక నెలలో అధిక వేగంతో 3.3 టీబీ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

రూ.1,099 ప్లాన్ లో 200 ఎంబీపీఎస్ వేగంతో డేటా వినియోగించుకోవచ్చు. నెలవారీగా 3.3 టీబీ డేటా వరకు ఈ వేగ పరిమితి వర్తిస్తుంది. రూ.1,599 ప్లాన్ లో ఉన్న ఓటీటీ సదుపాయాలు కూడా ఈ ప్లాన్ లో లభిస్తాయి. ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ సెట్ టాప్ బాక్స్ ను, 350 టీవీ చానల్స్ ను పొందొచ్చు.

రూ.699 ప్లాన్ లో డేటా వేగం 40 ఎంబీపీఎస్ కు (నెలవారీ 3.3 టీబీ వరకు ) పరిమితం అవుతుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మినహా మిగిలిన అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ సేవలను పొందొచ్చు.

More Telugu News