Spice Jet: లోపభూయిష్టమైన సిమ్యులేటర్ పై ట్రైనీ పైలట్లకు శిక్షణ... స్పైస్ జెట్ కు జరిమానా

  • నోయిడాలో స్పైస్ జెట్ ట్రైనీ పైలెట్లకు శిక్షణ
  • బోయింగ్ సిమ్యులేటర్ లోపాలు
  • గత మార్చిలో తనిఖీ చేసిన డీజీసీఏ
  • లోపాలు గుర్తించిన అధికారులు
DGCA fined Spice Jet

చవక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జరిమానా వడ్డించింది. లోపభూయిష్టమైన సిమ్యులేటర్ పై ట్రైనీ పైలెట్లకు శిక్షణ ఇచ్చిందంటూ రూ.10 లక్షల జరిమానా విధించింది. 

ఈ ఏడాది మార్చి 30న గ్రేటర్ నోయిడాలోని సీఏఈ సిమ్యులేషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ లో తనిఖీలు చేయగా, అక్కడ ట్రైనీ పైలెట్లకు శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తున్న బోయింగ్ 737 మ్యాక్స్ సిమ్యులేటర్ లో అనేక లోపాలు గుర్తించినట్టు డీజీసీఏ పేర్కొంది. సదరు సిమ్యులేటర్ లో కోపైలెట్ వైపున ఉండాల్సిన సాంకేతిక వ్యవస్థలు మార్చి 17 నుంచి పనిచేయకపోయినప్పటికీ, దాన్ని అలాగే ఉపయోగిస్తున్న విషయం వెల్లడైందని వివరించింది. ఇలాంటి సిమ్యులేటర్లపై శిక్షణ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని డీజీసీఏ స్పష్టం చేసింది.

More Telugu News