KRMB: కృష్ణా జ‌లాశ‌యాల క‌మిటీ భేటీ... వ‌రుస‌గా రెండో భేటీకి తెలంగాణ గైర్హాజరు

  • కేఆర్ఎంబీ స‌భ్యుడు ర‌వికుమార్ పిళ్లై నేతృత్వంలో భేటీ
  • ఏపీ నుంచి ఈఎన్సీ నారాయ‌ణ‌రెడ్డి, అధికారుల హాజ‌రు
  • శ్రీశైలం, సాగ‌ర్‌ల‌లో విద్యుదుత్ప‌త్తిపై చ‌ర్చ‌
telangana skips krmb meeting in hyderabad

కృష్ణా న‌దిపై నిర్మించిన జ‌లాశ‌యాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి జ‌రిగిన కృష్ణా జ‌లాశ‌యాల నిర్వ‌హ‌ణ క‌మిటీ సోమ‌వారం హైద‌రాబాద్‌లోని జ‌ల‌సౌధ‌లో భేటీ అయ్యింది. ఈ భేటీకి ఏపీ నుంచి ఈఎన్సీ నారాయ‌ణ రెడ్డితో పాటు ఆ రాష్ట్ర ప్ర‌తినిధి బృందం హాజ‌రు కాగా... తెలంగాణ నుంచి ఏ ఒక్క‌రు కూడా ఈ స‌మావేశానికి హాజ‌రు కాలేదు. ఈ క‌మిటీ భేటీకి తెలంగాణ గైర్హాజ‌రు కావ‌డం ఇది రెండోసారి. 

కృష్ణా న‌దీ జ‌లాల యాజ‌మాన్య క‌మిటీ (కేఆర్ఎంబీ) స‌భ్యుడు ర‌వికుమార్ పిళ్లై నేతృత్వంలో జ‌రిగిన ఈ భేటీలో శ్రీశైలంతో పాటు నాగార్జున సాగ‌ర్ జ‌లాశ‌యాల్లో విద్యుదుత్ప‌త్తి, రూల్ క‌ర్వ్‌పై చ‌ర్చ జ‌రిగింది. ఈ క‌మిటీ తొలిసారి స‌మావేశానికి కూడా గైర్హాజ‌రైన తెలంగాణ ఈఎన్సీ... రెండో స‌మావేశాన్ని జూన్ 15 త‌ర్వాత ఏర్పాటు చేయాల‌ని లేఖ‌లో కోరారు. అయితే ఆయ‌న అభ్య‌ర్థ‌న‌కు విరుద్ధంగా సోమ‌వారం (మే 30)న‌నే స‌మావేశం ఏర్పాటు చేయ‌డంతోనే తెలంగాణ ప్ర‌తినిధి బృందం ఈ భేటీకి గైర్హాజ‌రైన‌ట్లుగా సమాచారం.

More Telugu News