Parimal Nathwani: ఏపీ సీఎంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న జ‌గ‌న్‌... ఎంపీ ప‌రిమ‌ళ్ న‌త్వానీ ఆసక్తిక‌ర ట్వీట్‌

ysrcp mp  Parimal Nathwani greetings to ys jagan
  • 2019 మే 30న ఏపీ సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణం
  • రాష్ట్రాన్ని అభివృద్ది బాట‌లో పెట్టారంటూ జ‌గ‌న్‌కు న‌త్వానీ కితాబు
  • డైన‌మిక్‌, విజ‌న‌రీ లీడ‌ర్ అంటూ జగన్ కు ప్రశంసలు  
ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూడేళ్ల ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న నేతృత్వంలోని వైసీపీ రికార్డు విక్ట‌రీ సాధించ‌గా... 2019 మే 30న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ విజ‌య‌వాడ‌లో ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తానొక్క‌రే సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన జ‌గ‌న్‌... ఆ త‌ర్వాత కొన్నిరోజుల‌కు త‌న కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. 175 సీట్ల‌లో ఏకంగా 151 సీట్ల‌ను గెలుచుకున్నారు.

జ‌గ‌న్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ద‌క్కించుకున్న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ డైరెక్ట‌ర్ ప‌రిమ‌ళ్ న‌త్వానీ ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌గ‌న్‌కు అభినంద‌న‌లు తెలిపారు. మీ మూడేళ్ల పాల‌న‌లో ఏపీ ప‌లు రంగాల్లో మంచి అభివృద్ధి సాధించింద‌ని స‌ద‌రు ట్వీట్‌లో న‌త్వానీ పేర్కొన్నారు. జ‌గన్ ను డైన‌మిక్‌, విజ‌న‌రీ లీడ‌ర్ అంటూ న‌త్వానీ అభివ‌ర్ణించారు.
Parimal Nathwani
YSRCP
YS Jagan
Andhra Pradesh
AP CM

More Telugu News