Hardik Pandya: భావోద్వేగంతో హార్ధిక్ పాండ్యాను కౌగిలించుకున్న భార్య నటాషా.. వైరల్ అవుతున్న వీడియో!

Hardik Pandya wife Natasa Stankovic hugs him with emotion
  • ఐపీఎల్ లో విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు
  • కెప్టెన్ గా జట్టును విజయతీరానికి నడిపించిన హార్ధిక్ పాండ్యా
  • ఫైనల్స్ లో గెలుపొందగానే భావోద్వేగానికి గురైన పాండ్యా భార్య నటాషా
ఐపీఎల్ లో అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేని గుజరాత్ జట్టు హార్ధిక్ పాండ్యా నాయకత్వంలో జయకేతనం ఎగురవేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్స్ లో రాజస్థాన్ రాయల్స్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి, ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఈ నేపథ్యంలో, జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

మరోవైపు, గుజరాత్ జట్టు పైనల్స్ లో గెలుపొందగానే హార్ధిక్ పాండ్యా భార్య నటాషా భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తను భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. తన భార్య తనను కౌగిలించుకున్న సమయంలో హార్ధిక్ కళ్లలో కూడా భావోద్వేగం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు విజయానంతరం హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ, ఈ ఐపీఎల్ టోర్నీలో తాను ప్రశాంతంగా ఉండి, ఇంతగా రాణించడానికి తన భార్య, కొడుకే కారణమని చెప్పాడు.
Hardik Pandya
Wife
Natasa Stankovic
Hug
IPL

More Telugu News