Vijayasai Reddy: భారత్ లో కళాత్మక ప్రతిభకు కొదవలేదని ఈ డాక్యుమెంటరీ చిత్రం నిరూపించింది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy lauds All That Breathes documentary film makers
  • కేన్స్ లో ఘనంగా చలనచిత్రోత్సవం
  • విశిష్ట పురస్కారం అందుకున్న 'ఆల్ దట్ బ్రీత్స్'
  • చిత్ర బృందాన్ని అభినందించిన విజయసాయిరెడ్డి

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో 'ఆల్ దట్ బ్రీత్స్' అనే భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి విశిష్ట బహుమతి లభించడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. "కేన్స్ ఫిలిం ఫెస్టివల్-2022లో ఆల్ దట్ బ్రీత్స్ డాక్యుమెంటరీ చిత్రం ఎల్ఓయిల్ డిఓర్ పురస్కారం అందుకుంది. 

ఈ నేపథ్యంలో, "ఫిలింమేకర్ షౌనక్ సేన్, ఆయన బృందానికి అభినందనలు. వారి ఘనత కొనియాడదగినది. తమ డాక్యుమెంటరీ చిత్రం ద్వారా భారత్ లో ఫిలింమేకింగ్, కళాత్మక ప్రతిభకు కొదవలేదని నిరూపించారు" అంటూ కీర్తించారు.

  • Loading...

More Telugu News