Ranveer Singh: అట్టహాసంగా ఐపీఎల్ ముగింపు వేడుకలు... 'నాటు నాటు' పాటకు చిందేసిన రణవీర్ సింగ్

Ranveer Singh enthralled audience with his electrifying performance in IPL closing ceremony
  • ఐపీఎల్-15కు నేటితో తెర
  • ఫైనల్లో గుజరాత్ వర్సెస్ రాజస్థాన్
  • గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన అతిపెద్ద జెర్సీ
  • క్లోజింగ్ సెర్మనీలో అలరించిన వినోద కార్యక్రమాలు
క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరించిన ఐపీఎల్ 15వ సీజన్ నేటితో ముగియనుంది. ఇవాళ జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. మ్యాచ్ కు ముందు ఐపీఎల్ ముగింపు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీ రూపొందించిన నేపథ్యంలో బీసీసీఐ పెద్దలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు సర్టిఫికెట్ అందజేశారు. 

అనంతరం, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తన ఉత్సాహభరితమైన ప్రదర్శనతో అందరినీ ఉర్రూతలూగించాడు. పలు హిందీ పాటలతో పాటు ఆర్ఆర్ఆర్ లో సూపర్ హిట్టయిన నాటు నాటు పాటకు కూడా స్టెప్పులేయడం విశేషం. ఈ క్లోజింగ్ సెర్మనీలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ గాయని నీతి మోహన్ కూడా తమ బృందంతో కలిసి పలు హిట్ గీతాలు ఆలపించారు. మరికాసేపట్లో ఐపీఎల్ టైటిల్ సమరం ప్రారంభం కానుంది.
Ranveer Singh
IPL
Closing Ceremony
Natu Natu Song

More Telugu News