Peddireddi Ramachandra Reddy: బీసీ మంత్రులను డమ్మీలుగా చేసిన ఘనత చంద్రబాబుదే!:మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy slams Chandrababu
  • సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేపట్టిన వైసీపీ
  • నేడు రాయలసీమ చేరుకున్న బస్సుయాత్ర
  • చంద్రబాబుపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర రాయలసీమ చేరుకుంది. ఈ నేపథ్యంలో, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని అన్నారు. అన్ని కులాల వారికి పదవులు దక్కడం ఏపీలోనే చూస్తున్నామని తెలిపారు. తమ బస్సు యాత్రకు విశేష రీతిలో జనాలు నీరాజనాలు పడుతున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. 

తాము బస్సు యాత్రను టీడీపీ మహానాడుకు పోటీగా చేపట్టలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నీచరాజకీయాలకు స్వస్తిచెప్పాలని అన్నారు. బీసీ మంత్రులను డమ్మీలుగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని పెద్దిరెడ్డి విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ  ఏంచేసిందో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో ఇంటికి పంపారని, ఆయన చెప్పే మాయమాటలను ఎవరూ నమ్మబోరని అన్నారు.

  • Loading...

More Telugu News