వెంక‌న్నసేవ‌లో కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురి

29-05-2022 Sun 13:14
  • స‌తీస‌మేతంగా వెంక‌న్నను ద‌ర్శించుకున్న హ‌ర్‌దీప్ సింగ్‌
  • 1987 నుంచి ఏటా తిరుమ‌ల వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డి
  • స్వామి వారి ద‌ర్శ‌నంతో కొత్త ఉత్సాహం వ‌స్తుంద‌న్న కేంద్ర మంత్రి
union minister hardeep singh puri visits tirumala
తిరుమ‌ల కొండ‌పై క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం కోసం వేలాది మంది త‌ర‌లివ‌చ్చిన స‌మ‌యంలోనే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురి శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. శ‌నివారం రాత్రే తిరుమ‌ల చేరుకున్న హ‌ర్‌దీప్ సింగ్ దంప‌తులు... ఆదివారం ఉద‌యం వెంక‌న్నను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రికి వెంక‌న్న ద‌ర్శ‌న ఏర్పాట్ల‌ను చేసిన టీటీడీ చైర్మ‌న్ ద‌ర్శ‌నానంత‌రం మంత్రికి స్వామి వారి తీర్థ ప్ర‌సాదాలు, శ్రీవారి చిత్ర‌ప‌టాన్ని అంద‌జేశారు. 

ఈ సంద‌ర్భంగా ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా హ‌ర్‌దీప్ సింగ్ పురి... 1987 నుంచి ఏటా తాను స్వామి వారి సేవ‌లో పాల్గొంటున్నాన‌ని తెలిపారు. స్వామి వారి ద‌ర్శ‌నంతో త‌న‌లో కొత్త ఉత్సాహం వ‌చ్చిన‌ట్లుగా ఉంటుంద‌ని, ఈ కార‌ణంగానే ఏటా తాను త‌ప్ప‌నిస‌రిగా తిరుమ‌ల వ‌స్తుంటాన‌ని తెలిపారు.