వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పేరిట బెజ‌వాడ యువ‌కుడి మోసం

28-05-2022 Sat 21:34
  • ఆర్కే పేరిట విమాన టికెట్ల బుకింగ్‌
  • గొల్ల‌పుడికి చెందిన సాయి తేజ మోసం
  • అరెస్ట్ చేసిన పోలీసులు
ap police arest a person sho booking flight tickets in nameof ysrcp mla alla ramakrishna reddy
వైసీపీ కీల‌క నేత‌, గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పేరిట మోసానికి పాల్ప‌డుతున్న ఓ వ్య‌క్తిని పోలీసులు శ‌నివారం అరెస్ట్ చేశారు. నిందితుడిని విజ‌య‌వాడ‌లోని గొల్ల‌పూడికి చెందిన సాయి తేజ‌గా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే ఆర్కే పేరిట విమాన టికెట్లు బుక్ చేస్తూ నిందితుడు ప‌ట్టుబ‌డ్డాడు. 

గ‌త కొంత‌కాలంగా కొన‌సాగుతున్న ఈ వ్య‌వ‌హారంపై స‌మాచారం అందుకున్న పోలీసులు... శ‌నివారం నిందితుడిని విజ‌య‌వాడ‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉంది.