తార‌కరాముడు జ‌న‌హృద‌య పాల‌కుడు!... ఉప్పొంగే పాట‌ను అందించిన నిర్మాత అట్లూరి!

28-05-2022 Sat 21:27
  • నేడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌
  • ఎన్టీఆర్ కీర్తిని కొనియాడుతూ నిర్మాత‌ అట్లూరి పాట‌
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేసిన టీడీపీ
tollywdooed prodycer atluri narayana rao releases a song on ntr
తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శ‌నివారం పెద్ద ఎత్తున వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో భాగంగా ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు పార్టీల‌క‌తీతంగా ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. అదే స‌మ‌యంలో తెలుగు నేల‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఓ ఉప్పొంగే గీతాన్ని రూపొందించి విడుద‌ల చేశారు.

"తారకరాముడు జనహృదయపాలకుడు యుగపురుషుడు..." అంటూ సాగిన ఈ పాట ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు ఇత‌రుల‌ను కూడా ఆక‌ట్టుకుంటోంది. అద్భుత పద విన్యాసంతో సాగిన ఈ పాట‌ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సాగించిన ప్ర‌స్థానాన్ని చరిత్రను వివరిస్తూ కమనీయంగా సాగింది. అట్లూరి నారాయణరావు సమర్పించిన ఈ పాటను టీడీపీ త‌న అధికారిక ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేసింది.