3.10 గంట‌ల‌కు యుద్ధం ప్రారంభం!.. అమ‌లాపురం అల్ల‌ర్ల నిందితుల వాట్సాప్‌లో సందేశం!

28-05-2022 Sat 21:07
  • ఇప్ప‌టిదాకా 44 మంది నిందితుల అరెస్ట్‌
  • అమ‌లాపురంలో మ‌రో 5 రోజుల పాటు 144 సెక్ష‌న్ అమ‌లు
  • మ‌రో 24 గంట‌ల పాటు ఇంట‌ర్నెట్ సేవ‌ల నిలిపివేత‌
ap police arrests 44 qccused in amalapiram clashes
కోనసీమ జిల్లా పేరు మార్పు నేప‌థ్యంలో ఆ జిల్లా కేంద్రం అమ‌లాపురంలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌కు సంబంధించి పోలీసుల దర్యాప్తులో భాగంగా శ‌నివారం ఓ కీల‌క ఆధారం ల‌భించింది. ప‌ట్ట‌ణంలో అల్ల‌ర్ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా భావించి అరెస్ట్ చేసిన నిందితుల మొబైల్ ఫోన్ల‌ను ప‌రిశీలించిన పోలీసులు... వాటిలోని వాట్సాప్ సందేశాల్లో ఓ కీల‌క అంశాన్ని క‌నుగొన్నారు.

 "3.10 గంట‌ల‌కు యుద్ధం ప్రారంభం... పోలీసులు భోజ‌నం చేసే స‌మ‌యం... ఇదే చ‌క్క‌టి త‌రుణం" అంటూ స‌ద‌రు చాట్స్‌లోని సందేశాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సందేశంతో నిందితులు వ్యూహాత్మ‌కంగానే అల్ల‌ర్ల‌కు పాల్ప‌డ్డార‌ని పోలీసులు నిర్ధారించారు.

ఇదిలా ఉంటే...అల్ల‌ర్ల‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా పోలీసులు 44 మందిని అరెస్ట్ చేశారు. పట్ట‌ణంలో మరో ఐదు రోజుల పాటు 144 సెక్ష‌న్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఇప్ప‌టికే నాలుగు రోజులుగా ఆగిపోయిన ఇంట‌ర్నెట్ స‌ర్వీసుల‌ను మ‌రో 24 గంట‌ల దాకా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌కటించారు.