యారాడ బీచ్‌పై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ప‌రిమ‌ళ్ న‌త్వానీ ట్వీట్‌!

28-05-2022 Sat 19:22
  • ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంద‌న్న న‌త్వానీ
  • త‌న ట్వీట్‌కు బీచ్ వీడియోను ట్యాగ్ చేసిన వైనం
  • కిష‌న్ రెడ్డి, రోజా ఖాతాలను ట్యాగ్ చేస్తూ న‌త్వానీ ట్వీట్‌
 Parimal Nathwani tweet on yarada beach
వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ సభ్యుడిగా కొన‌సాగుతున్న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ డైరెక్ట‌ర్ ప‌రిమ‌ళ్ న‌త్వానీ శ‌నివారం విశాఖ ప‌రిధిలోని యారాడ బీచ్‌పై ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు. ఆహ్లాద‌క‌రమైన వాతావ‌ర‌ణంతో కూడిన యారాడ బీచ్ ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తోంద‌ని పేర్కొన్న న‌త్వానీ...బీచ్‌ బంగారు, నీలం, ఆకుప‌చ్చ వ‌ర్ణాల‌తో అల‌రారుతోంద‌ని పేర్కొన్నారు. 

రాష్ట్రంలోని అతి పెద్ద న‌గ‌రం విశాఖ‌కు అత్యంత స‌మీపంలో ఉండ‌టంతో పాటుగా ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని సొంతం చేసుకున్న ఈ బీచ్ ప‌ర్యాట‌కుల‌ను ప‌ర‌వ‌శానికి గురి చేస్తోంద‌ని తెలిపారు. అంతేకాకుండా ఈ బీచ్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్యాగ్ చేసిన న‌త్వానీ... త‌న ట్వీట్‌ను కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి, ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ టూరిజం ట్విట్ట‌ర్ ఖాతాల‌కు ట్యాగ్ చేశారు.