రామ్ గోపాల్ వర్మ పని అయిపోయింది: నట్టి కుమార్

28-05-2022 Sat 17:35 | Entertainment
  • నట్టి క్రాంతి, నట్టి కరుణలపై ఫోర్జరీ కేసు పెట్టిన వర్మ
  • ఇవ్వాల్సిన డబ్బులు అడిగితే తన పిల్లలపై తప్పుడు కేసు పెట్టాడంటూ నట్టి కుమార్ ఫైర్
  • వర్మ చాలా మందిని మోసం చేశాడని వ్యాఖ్య
Ram Gopal Varma is finished says Natti Kumar
తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ నట్టి ఎంటర్ టైన్ మెంట్ కు చెందిన నట్టి క్రాంతి, నట్టి కరుణలపై పంజాగుట్ట పోలీసులకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పిల్లలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రామ్ గోపాల్ వర్మపై నట్టి కుమార్ నిప్పులు చెరిగారు. 

ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగితే తన పిల్లలు ఫోర్జరీ చేశారంటూ తప్పుడు కేసులు పెట్టాడని ఆయన మండిపడ్డారు. డబ్బులు తీసుకునేటప్పుడు బాగానే తీసుకున్నాడని... ఇవ్వమని అడిగితే మోసం అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆర్జీవీ తమనే కాకుండా చాలా మందిని మోసం చేశాడని నట్టి కుమార్ దుయ్యబట్టారు. వర్మకు అప్పులు ఇచ్చిన వాళ్లమంతా ఒక్కటయ్యామని... ఇక ఆయన పని అయిపోయినట్టేనని చెప్పారు. ఆర్జీవీ సినిమాలేవీ విడుదల కాకుండా చూస్తామని తెలిపారు. వర్మ పేరు మీద ఏ సినిమా వచ్చినా... సుప్రీంకోర్టు వరకు వెళ్లయినా సరే స్టే తెచ్చుకుంటామని చెప్పారు. వర్మతో కలిసి నిర్మాతలెవరూ సినిమా చేయవద్దని విన్నవించారు.