Nalgonda District: తెలంగాణలో విషాదం.. రథానికి విద్యుత్ తీగలు తగిలి ముగ్గురి మృతి!

Three dead in Telangana after chariot touches electricity wire
  • నల్గొండ జిల్లా కేతేపల్లిలో విషాదం
  • కరెంట్ షాక్ తో ముగ్గురు అక్కడికక్కడే మృతి
  • మరో నలుగురి పరిస్థితి విషాదం
తెలంగాణలోని నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే... రామాలయం వద్ద ఇనుప రథాన్ని తీస్తున్న క్రమంలో అక్కడ ప్రమాదం సంభవించింది. రథం పైభాగానికి విద్యుత్ తీగలు తగలడంలో కరెంట్ షాక్ కొట్టి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మృతులను కేతేపల్లి గ్రామానికి చెందిన పొగాకు మునయ్య (43), రాజాబోయిన యాదయ్య (42), మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20)గా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కేతేపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.
Nalgonda District
Chariot
Electctric Shock
Dead

More Telugu News