Mandava Venkateswar Rao: కేసీఆర్ తో పాటు ప్రముఖ నేతలందరినీ తయారు చేసింది ఎన్టీఆరే: మండవ వెంకటేశ్వరరావు 

All TDP leaders made by NTR says Mandava Venkateswara Rao
  • ముఖ్య నేతలంతా టీడీపీలో పని చేసిన వారేనన్న మండవ 
  • నాయకులను తీర్చిదిద్దింది టీడీపీనేనని వ్యాఖ్య 
  • ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నిలబడ్డ రోజు ఇప్పటికీ బాధను కలిగిస్తుందన్న మండవ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులను తయారు చేసింది దివంగత ఎన్టీఆరేనని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. ముఖ్య నేతలంతా టీడీపీలో పనిచేసిన వారేనని చెప్పారు. నాయకులను ఎన్టీఆర్ తయారు చేస్తే... ఆ నాయకులను తీర్చిదిద్దింది టీడీపీ అని అన్నారు. 

ఆనాడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నిలబడిన రోజు ఇప్పటికీ తనకు బాధను కలిగిస్తుందని చెప్పారు. ఈరోజు డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News