Ramoji Rao: తెలుగు జాతికి గర్వకారణం ఎన్టీఆర్: రామోజీరావు

NTR is proud of Telugu people says Ramoji Rao
  • తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అన్న రామోజీరావు 
  • ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలిపిన 'ఈనాడు' అధినేత 
  • ఎన్టీఆర్ తెలుగు నేలపై ప్రభవించడం మనందరి అదృష్టమని వ్యాఖ్య 
తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు ఎన్టీఆర్ శత జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు స్మరించుకున్నారు. వెండి తెరపై నవరసాలు పండించిన మహానటుడు, అశేష అభిమానుల హృదయసీమను అవిఘ్నంగా ఏలిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ మహామనిషి శత జయంతి సందర్భంగా అందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. 

ఎన్టీఆర్ తెలుగు నేలపై ప్రభవించడం తెలుగువారిగా మనందరి అదృష్టమని చెప్పారు. కృషి, దీక్ష, పట్టుదలకు ప్రతీకగా, నియమ నిష్టలకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఆఖరి క్షణం వరకు జీవితాన్ని సాగించిన వికసిత వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ ద్వారా తన అంతరంగాన్ని తెలియజేశారు. 
Ramoji Rao
NTR
Jayanthi

More Telugu News