ట్రాక్టర్‌పై ఎంట్రీ ఇచ్చిన వధువు.. పెళ్లి కొడుకు షాక్!

  • అన్నదమ్ములిద్దరినీ చెరోవైపు కూర్చోబెట్టుకుని వచ్చిన వధువు
  • మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఘటన
  • వైరల్ అవుతున్న వీడియో
Bride Enter in to wedding hall while driving a tractor in madhyapradesh

కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలన్న ఉద్దేశం వారిని సరికొత్త ఆలోచనల దిశగా నడిపిస్తోంది. 

ఇప్పుడీ ట్రెండ్ పెళ్లిళ్లకు కూడా పాకింది. పెళ్లిలో సిగ్గుల మొగ్గలవాల్సిన వధువు డ్యాన్స్ చేస్తూ వరుడ్ని ఆశ్చర్యపరుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఇదే ట్రెండ్ నడుస్తుండగా, తాజాగా మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా జావ్రా గ్రామంలో ఓ నవ వధువు ట్రాక్టర్ నడుపుకుంటూ కల్యాణ మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

గ్రామానికి చెందిన భారతి తద్గేకు పొరుగూరు యువకుడితో వివాహం నిశ్చయమైంది. గురువారం సాయంత్రం వివాహం జరిగింది. వధువు భారతి తన అన్నదమ్ములిద్దరినీ చెరో పక్కన కూర్చోబెట్టుకుని ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి చేరుకుంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు, నల్లని కళ్లద్దాలు ధరించి హుందాగా ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి వచ్చింది. పెళ్లి కుమార్తె అలా రావడం చూసిన వరుడు సహా పెళ్లికొచ్చిన వారు షాకయ్యారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

More Telugu News