ఫిల్మ్ న‌గ‌ర్‌లో రేపు ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌... హాజ‌రుకానున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

27-05-2022 Fri 21:54
  • రేపు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌
  • ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఆయ‌న‌కు నివాళి అర్పించ‌నున్న టీఆర్ఎస్ నేత‌లు
  • ఫిల్మ్ న‌గ‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు టీఆర్ఎస్ కీల‌క నేత‌లు
tsr leaders likely to attend ntr 100th jayanthi in hyderabad
టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో అధికార టీఆర్ఎస్ నేత‌ల ఆధ్వ‌ర్యంలో ప‌లు కార్య‌క్ర‌మాలు జ‌ర‌గనున్నాయి. రేపు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్ల‌నున్న కొంద‌రు టీఆర్ఎస్ ప్ర‌తినిధులు... ఎన్టీఆర్‌కు నివాళి అర్పించ‌నున్నారు. 

అదే స‌మయంలో న‌గ‌రంలోని ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుక‌కు టీఆర్ఎస్‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు కూడా హాజ‌రుకానున్నారు.