శంకర్ సినిమాలో మన క్యారెక్టర్ మామూలుగా ఉండదు: సునీల్

27-05-2022 Fri 17:24
  • పూర్తి స్థాయి కామెడీ పాత్రల వైపు సునీల్  
  • 'శంకర్ సినిమాలో ముఖ్యమైన రోల్ 
  • మంచి పేరు తెస్తుందన్న సునీల్
Sunil Interview
సునీల్ పూర్తి స్థాయి కామెడీ పాత్రలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ లోగా తనకి వచ్చిన విభిన్నమైన పాత్రలను చేస్తూనే, గతంలో తాను వదిలేసిన ప్లేస్ కి చేరుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోను సునీల్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. 

ఈ సినిమాలో తన పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు చాలా కొత్తగా ఉంటుందనీ, ఇది మామూలుగా వుండదనీ, ఈ పాత్ర తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని సునీల్ చెబుతున్నాడు. చరణ్ పాత్ర వెంటనే ఉంటూ ఈ సినిమా మొత్తం తాను కనిపిస్తాననీ, తన పాత్రను గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారని తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు.