ఆస్కార్ అవార్డు విజేతపై లైంగిక వేధింపుల కేసు!

27-05-2022 Fri 17:24
  • లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న కెవిన్ స్పేసీ
  • ముగ్గురు పురుషులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు
  • వీరిలో ఇద్దరితో లైంగిక చర్యల్లో పాల్గొన్నట్టు ఛార్జ్ షీట్
Oscar winner Kevin Spacey faces charge sheet in sexual harassment case
'అమెరికన్ బ్యూటీ', 'ది యూజువల్ సస్పెక్ట్స్' వంటి హిట్ సినిమాల్లో నటించి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న హాలీవుడ్ స్టార్ కెవిన్ స్పేసీ ఇబ్బందుల్లో పడ్డాడు. లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్నాడు. ఆయనపై బ్రిటన్ పోలీసులు ఛార్జ్ షీట్ ను నమోదు చేశారు. మీటూ ఉద్యమం సమయంలో తొలిసారిగా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ముగ్గురు పురుషులపై కెవిన్ నాలుగు సార్లు వేధింపులకు పాల్పడినట్టు ద క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తెలిపింది. ఒక వ్యక్తిపై వేధింపులకు పాల్పడ్డాడని... ఇద్దరు వ్యక్తులతో లైంగిక చర్యల్లో పాల్గొన్నాడని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అయితే ఇంగ్లీష్ చట్టాల ప్రకారం బాధితులను ఇంత వరకు గుర్తించలేదు.