మార్కెట్లకు ఈరోజు ఆద్యంతం లాభాలే!

27-05-2022 Fri 16:34
  • 632 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 182 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ టెక్ మహీంద్రా షేర్ విలువ
Markets ends in profits
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు లాభాల్లోనే పయనించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో పాటు నిన్న అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 632 పాయింట్లు లాభపడి 54,884కి చేరుకుంది. నిఫ్టీ 182 పాయింట్లు పుంజుకుని 16,352కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (4.10%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.23%), విప్రో (2.98%), బజాజ్ ఫైనాన్స్ (2.98%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.67%). 

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-2.43%), భారతి ఎయిర్ టెల్ (-1.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.97%), టాటా స్టీల్ (-0.81%), రిలయన్స్ (-0.47%).