కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు బర్త్ డే విషెస్!
- నేడు నితిన్ గడ్కరీ బర్త్ డే
- ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రికి చంద్రబాబు విషెస్
- గడ్కరీతో తాను కలిసి ఉన్న ఫొటోను యాడ్ చేసిన టీడీపీ చీఫ్
ఈ మేరకు గడ్కరీ జన్మదినాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. గతంలో తాను సీఎంగా ఉండగా...ఏపీ పర్యటనకు వచ్చిన గడ్కరీతో ఓ వేదిక మీద కలిసి కూర్చున్న ఫొటోను చంద్రబాబు తన ట్వీట్‌కు జత చేశారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు గడ్కరీకి మరింత మేర అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు.