మహానాడులో నారా లోకేశ్ ఎంట్రీ మామూలుగా లేదు.. వీడియో ఇదిగో!

27-05-2022 Fri 15:44
  • ఒంగోలులో కొనసాగుతున్న తొలిరోజు మహానాడు
  • కార్యక్రమానికి హాజరైన దాదాపు 12 వేల మంది
  • నారా లోకేశ్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
Nara Lokesh grad entry at TDP Mahanadu
ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమం ఆ పార్టీ శ్రేణుల ఉత్సాహాల మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రం నలు మూలల నుంచి తరలి వచ్చిన టీడీపీ అభిమానులతో సభా ప్రాంగణం నిండిపోయింది. 

మరోవైపు ఉదయం మహానాడుకు విచ్చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. వారిని నిలువరించేందుకు సెక్యూరిటీ సిబ్బంది నానా తంటాలు పడాల్సివచ్చింది. అభిమానుల మధ్య నుంచే పార్టీ కేడర్ ను పలకరించేందుకు ఆయన రిసెప్షన్ కౌంటర్ వద్దకు వెళ్లారు. అక్కడ డబ్బులు చెల్లించి పార్టీ బ్రోచర్ ను తీసుకున్నారు. మరోవైపు, మహానాడుకు 12 వేల మంది వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.