నా అనుమతి లేకుండా వీడియో తీశారు.. జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి సంచలన ఆరోపణలు

  • శారీరక సామర్థ్య పరీక్ష సందర్భంగా జరిగిన పరిణామంపై ప్రకటన
  • జిమ్నాస్టిక్ ఫెడరేషన్ అలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్న అరుణ 
  • కోచ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడి
Top gymnast Aruna Budda Reddy alleges she was videographed

తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ లో వ్యక్తిగత విభాగంలో మెడల్ సంపాదించిన తొలి జిమ్నాస్ట్ గా ఆమె గుర్తింపు పొందడం తెలిసిందే. 2018లో మెల్ బోర్న్ లో జరిగిన పోటీల్లో ఆమె కాంస్య పతకం గెలుచుకుంది. 

ఢిల్లీలోని ఐజీఐ స్టేడియంలో ఈ ఏడాది మార్చిలో ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) కోచ్ ఒకరు వీడియో తీసినట్టు అరుణ ఆరోపించారు. ఫిజికెల్ ఫిట్ నెస్ నిర్ధారణ సమయంలో వీడియో తీయాలంటూ తాము ఆదేశించలేదని జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ తనకు తెలిపినట్టు అరుణ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సదరు కోచ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది.

బకు వరల్డ్ కప్ కు ముందు కోచ్ మనోజ్ రాణాతో కలసి అరుణ బుద్ధారెడ్డి ఢిల్లీలోని ఐజీఐ స్టేడియంకు 2022 మార్చి 24న వెళ్లడం జరిగింది. ఆ సమయంలో.. తన క్లినికల్, మాన్యువల్ అసెస్ మెంట్ టెస్ట్ సందర్భంగా జైశ్వాల్ అనే ట్రైనీ.. కోచ్ మొబైల్ ఫోన్ నుంచి చిత్రీకరించినట్టు అరుణ వెల్లడించారు. 

More Telugu News