Russia: విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి.. ట్రైనీ పైలట్‌తో శృంగారం!

Russian Pilot Offers Extra Flying Time To Student In Exchange For Sex
  • ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని ఆశ చూపిన పైలట్
  • లొంగిపోయిన స్టూడెంట్.. విమానంలో కామకేళి
  • మొబైల్‌లో చిత్రీకరణ.. వీడియోను బయటపెట్టిన తోటి కేడెట్ 
  • ఇద్దరినీ సస్పెండ్ చేసిన ఫ్లైయింగ్ స్కూల్
ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్.. విమానం గాల్లో ఉండగానే ఆమెతో రాసలీలకు దిగాడు. విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయాడు. రష్యాలో జరిగిందీ ఘటన. 

21 ఏళ్ల ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇస్తున్న పైలట్ (28) తన కోరిక తీరిస్తే మరిన్ని ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని ఆశ చూపాడు. తొలుత ఆమె నిరాకరించినా ఆ తర్వాత అతడికి లొంగిపోయింది. దీంతో విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టాడు. ఆపై ఇద్దరూ రాసలీలలకు దిగారు. అంతేకాదు, మొబైల్‌లో తమ శృంగారం మొత్తాన్ని రికార్డు కూడా చేసుకున్నారు. 

ఈ విషయం బయటకు రాకుండా రహస్యంగా ఉండిపోయేదే. అయితే, ఆ ట్రైనీ పైలట్ తన తోటి కేడెట్‌తో గొడవపడింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఈ వీడియోను బయటపెట్టేసింది. దీంతో విషయం కాస్తా బయటకు వచ్చేసింది. వెంటనే అప్రమత్తమైన ఫ్లైయింగ్ స్కూల్ పైలట్‌ను, ట్రైనీ పైలట్‌ను బహిష్కరించింది. ఇదే విషయమై తొలుత ఆ ట్రైనీ పైలట్ మాట్లాడుతూ.. తాము ముద్దులు, కౌగిలింతలకే పరిమితమయ్యామని చెప్పింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ ‘అలా’ ఒకసారే జరిగిందని చెప్పుకొచ్చింది.
Russia
Pilot
Student
Romance

More Telugu News