తెలంగాణలో 47 మందికి కరోనా పాజిటివ్

26-05-2022 Thu 20:54
  • గత 24 గంటల్లో12,971 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 26 కొత్త కేసులు
  • రంగారెడ్డి జిల్లాలో 18 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 28 మంది
  • ఇంకా 417 మందికి చికిత్స
Telangana corona daily updates
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 12,971 కరోనా పరీక్షలు నిర్వహించగా, 47 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 26 కొత్త కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 18, హనుమకొండ జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 28 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా కరోనాతో మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 7,93,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,516 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 417 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.