ఫైట్లు చేయడం ఈజీ .. కామెడీనే కష్టం: వరుణ్ తేజ్

26-05-2022 Thu 19:59
  • 'ఎఫ్ 3' ప్రమోషన్స్ లో బిజీగా వరుణ్ తేజ్
  • ఈ కథలో అందరూ డబ్బునే ప్రేమిస్తారన్న వరుణ్ 
  • అందరూ నాటకాలు ఆడుతూ ఉంటారంటూ వివరణ 
  • కామెడీ స్టార్స్ తో కలిసి నటించడం అంత ఈజీ కాదంటూ వ్యాఖ్య
Varun Tej Inetview
వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కాంబినేషన్లో 'ఎఫ్ 3' సినిమా రూపొందింది.  తమన్నా ... మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా..  దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి వరుణ్ తేజ్ ప్రస్తావించాడు.

"నేను, వెంకటేశ్ గారు కలిసి 'ఎఫ్ 2' సినిమాను థియేటర్స్ లో చూశాము. అప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి .. 'ఎఫ్ 3' తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ కథలో ఎవరి ప్రేమలోను నిజాయతీ ఉండదు .. అందరూ డబ్బునే ప్రేమిస్తూ మిగతా విషయాల్లో నటిస్తుంటారు .. నాటకమాడుతుంటారు.

ఇక ఈ సినిమాలోని వెంకటేశ్ గారికి రేచీకటి .. నాకు నత్తి. అలాంటి ఇద్దరం ఒక రాత్రివేళలో కలుసుకుంటాము. అప్పుడు చోటుచేసుకునే సన్నివేశాలు తెరపై చూడవలసిందే. ఈ సారి సునీల్ తో కలిసి కామెడీని షేర్ చేసుకోవడం మరింత ఫన్ గా అనిపించింది. వెంకటేశ్ .. సునీల్ .. అలీ లాంటివారితో కలిసి కామెడీ చేయడం కంటే ఫైట్లు చేయడమే ఈజీ అనిపించింది" అని చెప్పుకొచ్చాడు.