ప్ర‌ధానిగా మోదీ ఎన్నికై నేటికి 8 ఏళ్లు!... విషెస్ చెబుతూ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ట్వీట్‌!

26-05-2022 Thu 18:59
  • 2014 మే 26న భార‌త ప్ర‌ధానిగా మోదీ బాధ్య‌త స్వీకర‌ణ‌
  • 2019లో వ‌రుస‌గా రెండో సారి పీఎంగా ప్ర‌మాణం
  • ప్ర‌ధానిగా 8 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న మోదీ
  • మోదీకి గ్రీటింగ్స్ చెబుతూ క‌న్నా లక్ష్మీనారాయ‌ణ ట్వీట్‌
kanna lakshminarayana tweet on modi completes 8 years as pm
భార‌త ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి నేటికి స‌రిగ్గా 8 ఏళ్లు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ రికార్డు విక్ట‌రీ న‌మోదు చేయ‌గా... 2014 మే 26న భార‌త ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లోనూ బీజేపీ విజ‌యం సాధించ‌గా వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం కూడా మోదీనే ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మొత్తంగా భార‌త ప్ర‌ధాన మంత్రి హోదాలో మోదీ 8 ఏళ్ల మైలురాయిని గురువారం చేరుకున్నారు. 

ఈ సంద‌ర్భాన్ని గుర్తు చేసుకుంటూ బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా మోదీ ఎన్నికై నేటికి 8 సంవత్సరాలు అంటూ పేర్కొన్న క‌న్నా.. అధికారాన్ని అతిపవిత్రమైన బాధ్యతగా, సంక్షోభాలను సవాళ్ళను ఎదుర్కొంటూ, విజయాలెన్ని దక్కినా పొంగిపోని నిగర్విగా, భరతమాత సేవలో భారత్ ని విశ్వగురుగా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీకి శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ పోస్ట్ చేశారు.